యన్‌టిఆర్‌’ బయోపిక్‌ బసవతారకం లుక్ !

తెలుగు న్యూస్ టుడే ➤ టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ లో వున్నది. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ ఎంత ప్రేక్షకాదరణ పొందినదో , ప్రస్తుతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న బ‌యోపిక్ ఎన్టీఆర్‌. రెండు భాగాలుగా విడుద‌ల కానున్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాల‌య్య కనిపించ‌నుండ‌గా, ఆయ‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించి కొన్ని లుక్స్ విడుద‌ల చేసిన టీం బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌ల చేయ‌లేదు. తాజాగా విద్యాబాల‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బ‌స‌వ‌తార‌కం లుక్‌లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నేనేం చూస్తున్నాను అనే కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ప్ర‌స్తుతం అభిమానుల‌ని అల‌రించ‌డ‌మే కాక సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చిత్ర తొలి భాగం క‌థానాయ‌కుడు పేరుతో జ‌న‌వరి 9న విడుద‌ల కానుండ‌గా, రెండో భాగం మ‌హానాయ‌కుడు పేరుతో జ‌న‌వ‌రి 24న రిలీజ్ కానుంది. యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌, చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

Leave a Comment