రౌడీ విజయ్ ‘నోటా’ మూవీ షార్ట్ నెంబర్ ఫస్ట్ సాంగ్ టీజర్ !

తెలుగు న్యూస్ టుడే ➤ ఆనంద్‌ శంకర్‌ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా నోటా. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది యూనిట్. విజయ్ సరసన మెహ్రీన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ టీజర్ లో విజయ్‌ తాగుతూ చిందులేస్తూ కన్పించాడు. గ్రీన్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై జ్ఞానవేల్‌రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ ట్విటర్‌ వేదికగా సంతోషాన్ని పంచుకున్నాడు. సినిమా విడుదల తేదీని మనమంతా సెలబ్రేట్‌ చేసుకుందాం. ఆ తేదీన మీరు, నేను థియేటర్ల వద్ద కలుద్దాం. మీ కోసం షాట్‌ నంబర్ సాంగ్ అని ట్వీట్‌ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ తెలుగు, తమిళంలో అక్టోబర్‌ 5న రిలీజ్ కాబోతోంది.

Leave a Comment