నోటా పై రౌడీ కామెంట్లు !

తెలుగు న్యూస్ టుడే ➤ గీత గోవిందం చిత్రంతో స్టార్ స్టేటస్ సాధించి, ప్రస్తుతం రాజకీయ కథాంశంతో తెరకెక్కిన ‘నోటా’ తో వివాదాల్లో ఉన్న ఈ రౌడీ నోటా సినిమాపై కేసులు పెట్టిన వాళ్లపై మరోసారి విరుచుకుపడ్డాడు హీరో విజయ్ దేవరకొండ. పబ్లిక్ మీటింగ్స్ అంటూ 2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు పెట్టి ఇప్పటికే సినిమాపై కేసు వేసిన వ్యక్తులను ఓ రేంజ్ లో ఆడుకున్న దేవరకొండ, తాజాగా సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మరోసారి వాళ్లను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు.

“మా పార్టీ కంటే నోటా బెటర్ ఆప్షన్ అని భయపడేవాళ్లు మా సినిమాపై విమర్శలు చేస్తున్నారు. కంప్లయింట్స్ ఇస్తున్నారు. వాళ్ల పార్టీపై వాళ్లకు కాన్ఫిడెన్స్ లేదు. నిజంగా తమ పార్టీపై తమకు నమ్మకం ఉన్నోళ్లు ఎవరేం మాట్లడడం లేదు.” ఇలా నోటాపై ఫిర్యాదులు చేసిన వాళ్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. నిజంగా సినిమా ఇబ్బందికరంగా ఉంటే సెన్సార్ అధికారులు ఆపేస్తారని, కోర్టుల వరకు వెళ్లాల్సిన పని లేదని అంటున్నాడు విజయ్ దేవరకొండ.

“తమిళ్ లో నోటాకు U సర్టిఫికేట్ ఇచ్చారు. నాకు కొంచెం ఇన్సల్ట్ అనిపించింది. తెలుగులో మాత్రం కొంచెం నా ముఖం చూసి U/A ఇచ్చినట్టున్నారు. మా సినిమా ఎంత క్లీన్ గా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఇంకేంకావాలి. సినిమాలో సన్నివేశాలు చూసి, ఇదేదో మనకు సంబంధించిందని ఫీలయ్యేవాళ్లు గొడవ పడతారు. తప్పుడు పని చేసేవాళ్లే గొడవలు చేస్తారు. ఈ సీన్ మనమీద కాదు అని ఫీలయ్యే రాజకీయ పార్టీ ఎంజాయ్ చేస్తుంది.” అంతా అనుకున్నట్టు సెన్సారోళ్లు నోటా సినిమాలో సీన్లకు సీన్లు లేపేయలేదంటున్నాడు దేవరకొండ. అన్ని సినిమాలకు చెప్పినట్టే చిన్న చిన్న కట్స్ చెప్పారని, అది పెద్ద సమస్య కాదంటున్నాడు. అంతకుమించి సినిమాకు ఎక్కడా సెన్సార్ ఆఫీసర్లు అభ్యంతరం చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు ఈహీరో.

Leave a Comment