సైరా సుదీప్, విజ‌య్ సేతుప‌తి లుక్ విడుదల !

తెలుగు న్యూస్ టుడే ➤ తెల్లదొరలను ఎదిరించి భార‌త‌మాత‌కి బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.. ఆసియా బోర్డర్ జార్జియాలో షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలిసిందే . 40రోజుల పాటు ఈ దేశంలో జ‌ర‌గ‌నున్న‌ భారీ వార్ సీక్వెన్స్ ఎపిసోడ్‌లో 300 గుర్రాలు,150 మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు కొంత మంది సీనియ‌ర్ స్టార్స్ పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం. ఈ ఫైట్ కోసం స్లోవోకియా నుండి ప్ర‌త్యేకంగా 3డీ ఫ్లైయింగ్ కెమెరా తెప్పించిన‌ట్టు తెలుస్తుంది . మొత్తం 500కి పైగా స‌భ్యులు ఫైట్ స‌న్నివేశం కోసం పని చేయ‌నున్నార‌ట‌. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి, క‌న్నడ హీరో సుదీప్ కూడా షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. తాజాగా వారిరివురి లొకేష‌న్ ఫోటో ఒక‌టి విడుద‌లైంది. సుదీప్ అవుకు రాజు అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండగా, విజ‌య్ సేతుప‌తి త‌మిళ భాష‌ని తెలుగులోకి అనువ‌దించే వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

సైరా చిత్రం వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఇందులో చిరంజీవి స‌ర‌స‌న నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ రోజు అమితాబ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. న‌ర‌సింహ‌రెడ్డి గురువు గోస‌యి వెంక‌న్న పాత్ర‌లో అమితాబ్ క‌నిపించ‌నున్నారు.

Leave a Comment