హైద్రాబాద్ న్యూస్ ➤ యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నవంబర్ 16న టాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా, గ్రాఫిక్స్ కారణంగా లేట్ అయింది. అయితే చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీపై ఆసక్తి కలిగేలా ప్రమోషనల్ వీడియోలు విడుదల చేస్తున్నారు. టాక్సీ వాలా చిత్రంలోని మాటే వినదుగా అనే పాట లిరికల్ వీడియోని ఇటీవల విడుదల చేశారు. అతి తక్కువ టైంలోనే 2 మిలియన్ వ్యూస్ సంపాదించి షాకిచ్చింది. ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, జేక్స్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ పాట చిత్రంలో కీలకం కానుందని తెలుస్తుండగా, తాజాగా ఈ పాటకి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో విజయ్ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు. జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విజయ్‌కి మరో హిట్ అందిస్తుందని అంటున్నారు. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
టాక్సీవాలా ‘మాటే వినదుగా’ లిరికల్ వీడియో సాంగ్
Leave a Comment