నేడు వరంగల్ నిట్ వజ్రోత్సవాలు

తెలుగు న్యూస్ టుడే ➤ వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్) 60వ వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నేడు (సోమవారం) వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిపాటు జరిగే వేడుకలను ప్రారంభించేందుకు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు వెంకయ్యనాయుడు నిట్‌కు చేరుకుని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభిస్తారని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు.

ఈ సందర్భంగా రూ.25 కోట్లతో నిర్మించనున్న అల్యుమిని (పూర్వవిద్యార్ధుల) కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ఆర్‌ఈసీ, నిట్‌లలో పని చేసిన ప్రిన్సిపాల్స్, డైరక్టర్లనును సన్మానించి ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో మాట్లాడుతారని ఆయన పేర్కొన్నారు. ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారాల కోసం పెద్ద స్క్రీన్‌ల ద్వారా విద్యార్ధులు, నిట్ ఉద్యోగులు, ఇతర అధికారులు ముఖ్యఅతిథుల ప్రసంగం చూసేలా ఏర్పాట్లు చేశారు. గంటపాటు జరిగే ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారు.

Leave a Comment