సవ్యసాచి ‘వై నాట్’ సాంగ్ ట్రైలర్

తెలుగు న్యూస్ టుడే ➤  అక్కినేని నాగ చైత‌న్య‌, చందూ మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌వ్య‌సాచి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చైతూ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందూ మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. న‌వంబ‌ర్ 2న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందించారు. ఆయ‌న స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా మూవీ నుండి వై నాట్ అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియో అభిమానుల‌ని అల‌రిస్తుంది. చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేష్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Leave a Comment