ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి

తెలుగు న్యూస్ టుడే ➤ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో వరల్డ్ వైడ్ గా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది. వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌ సైట్‌ యూట్యూబ్‌ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. ఈ సమస్య రెండు గంటలపాటు కొనసాగింది. అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిన యూట్యూబ్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక లోపంతో ప్రపంచవ్యాప్తంగా బుధవారం యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి.

ఈ సమస్య భారత్‌లో కూడా తలెత్తింది. కొంతమంది యూజర్లు యూట్యూబ్‌ను ఓపెన్ చేసినప్పుడు తమ వ్యక్తిగత కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లపై వచ్చిన సందేశాలను స్క్రీన్ షాట్ తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. యూట్యూబ్‌ను లాగిన్ చేసినప్పుడు, వీడియోలను అప్‌లోడ్, వీక్షించే క్రమంలో Please check your network connection (Retry), Error loading. Tap to retry. లాంటి ఎర్రర్ మెసేజ్‌లు కనిపించడంతో యూజర్లు ఇబ్బందిపడ్డారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ ట్వీట్ చేసింది. యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ ను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

యూట్యూబ్‌ను ప్రముఖ సెర్చ్‌ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.

Leave a Comment