తెలుగు న్యూస్ టుడే ➤ టాలీవుడ్లో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రం సవ్యసాచి. నవంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రంలో నాగ చైతన్య, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
సవ్యసాచి చిత్రంలో మాధవన్, భూమికలు ముఖ్య పాత్రలు పోషించారు. మాధవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తుంది. చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.ఇటీవల చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌తో పాటు పలు సాంగ్స్ కూడా విడుదల చేశారు. ఇవి సినిమాపై చాలా ఆసక్తిని కలిగించాయి. ఇక చిత్ర ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, తాజాగా ట్రైలర్‌కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అక్టోబర్ 24న మధ్యాహ్నం 3గం.లకి చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.