తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ట్యాక్సీవాలా. ఈ నెల 17న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.ఆసక్తికరంగా రూపొందించిన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఐదేళ్లు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేశావన్న మాట.. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు రా’ అని విజయ్‌ను ఆయన స్నేహితుడు ప్రశ్నించే డైలాగ్‌తో ప్రారంభమైంది ట్రైలర్. తొలుత సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన హీరో తర్వాత టాక్సీ డ్రైవర్‌గా మారడం… ఈ కారుకు ఓ క్యారెక్టర్ ఉంది రా.. నువ్వు (కారు) వచ్చాక లైఫ్ యూటర్న్ తిరిగింది అని విజయ్ చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. వినడానికి విచిత్రంగానే ఉన్నా నమ్మండి. ఆ కారులో దెయ్యం ఉంది అని విజయ్ భయపడుతూ చెప్పడం సినిమాపై అంచనాలను పెంచేసింది.
ట్యాక్సీ వాలా ట్రైలర్ తో భయపడ్డాడు
Leave a Comment