తెలుగు న్యూస్ టుడే ➤ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలు ఎంత స్టైలిష్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసి మంచి అవుట్ పుట్ ఇస్తాడు. ఇటీవల బాలయ్యతో పైసా వసూల్ సినిమా చేసిన పూరీ ఆ తర్వాత తన తనయుడు ఆకాశ్‌తో మెహబూబా చిత్రం చేశాడు. ఈ రెండు సినిమాలు అంతగా ఆదరణ పొందలేకపోయాయి. తాజాగా మరో ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో చిత్ర బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నాడు. అయితే 18 నుండి 24 సంవత్సరాల వయస్సు ఉండి, అచ్చ తెలుగు మాట్లాడే అమ్మాయిలు తన సినిమాకి కావాలని కాస్టింగ్ కాల్ ఇచ్చాడు పూరీ. ఆసక్తి ఉన్న నటీమణులు తమ వివరాలని maniraj@puriconnects.com మెయిల్ ఐడీకి పంపాలని కోరారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ వివరాలు పంపి పూరీ సినిమాలో నటించే అవకాశాన్ని పొందండి.
అచ్చ తెలుగు మాట్లాడే అమ్మాయిలకు పూరీ కాస్టింగ్ కాల్
Leave a Comment