అమరావతి వేదికగా ఎఫ్1 హెచ్‌టూవో ఐదో ఎడిషన్

తెలుగు న్యూస్ టుడే ➤ అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎఫ్1 హెచ్‌టూవో ఐదో ఎడిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీవరకు కృష్ణా నదిలో స్పీడ్‌బోట్ రేస్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్యదర్శి ఎంకే మీనా తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మహాలక్ష్మి గ్రూప్ కంపెనీ సీఈవో సందీప్ మండవ, లాజిస్టిక్ డైరెక్టర్ మార్కో పీట్రినితో కలిసి రేసుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

Leave a Comment