శంకర్ రోబో 2.0 చిత్ర ట్రైలర్ విడుదల

తెలుగు న్యూస్ టుడే ➤ మోస్ట్ వెయిటెడ్ మూవీ కోలీవుడ్ ట్రెండ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ విజువ‌ల్ వండ‌ర్ 2.0 చిత్ర ట్రైలర్ ని 12గం.ల‌కు విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలోని స‌త్యం సినిమాస్ ట్రైల‌ర్ లాంచ్‌ని అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తున్నారు. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌, ఏఆర్ రెహ‌మాన్‌, శంక‌ర్, అమీ జాక్స‌న్ త‌దిత‌రులు ఈ కార్య‌క్రమానికి హాజ‌ర‌య్యారు. ట్రైల‌ర్‌ని 4డీ సౌండ్‌ టెక్నాలజీతో విడుద‌ల చేశారు , ఈ ఎక్స్ పీరియ‌న్స్ స‌రికొత్తగా ఉంటుంద‌ని అంటున్నారు ద‌ర్శ‌కుడు శంక‌ర్. 4డీ ఎఫెక్ట్ మ‌న సీటు కింద‌నే స్పీకర్స్ ఉన్నాయా అనే ఫీల్‌ని క‌లిగిస్తుంద‌ని శంక‌ర్ చెప్పారు. న‌వంబ‌ర్ 29న తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం అనేక రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌ని చెబుతున్నారు.

లాంచ్ కార్య‌క్ర‌మంలో ఏఆర్ రెహ‌మాన్ మాట్లాడుతూ.. ఎందిర లోగ‌త్తు అనే సాంగ్ విజువ‌ల్ ట్రీట్‌గా ఉంటుందని అన్నారు. ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టికి నా ఫేవ‌రేట్‌హీరో. అత‌ని వ్య‌క్తిత్వం అంద‌రికి స్పూర్తినిస్తుంది. ఈ వ‌య‌స్సులోను ప‌నిపై అత‌నికున్న ఆస‌క్తిని నేను గౌర‌విస్తాను. చిత్రంలో 18 కేజీల బ‌రువున్న కాస్ట్యూమ్‌ని ర‌జ‌నీ ధరించారు.

Leave a Comment