తెలుగున్యూస్ టుడే ➤ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘అన్నయ్య వీడిని చంపేయాలా..భయపెట్టాలా. భయపెట్టాలంటే పది నిమిషాలు..చంపాలంటే పావుగంట..ఏదైనా ఓకే సెలెక్ట్ చేసుకో’ అంటూ చెర్రీ చెప్పే డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్ గా నటిస్తోండగా..చెర్రీకి జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది. స్నేహ, కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Leave a Comment