తెలుగు న్యూస్ టుడే ➤ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’ . శ్రీను వైట్ల చాలా గ్యాప్ తర్వాత మాస్ మహరాజా రవితేజతో ఈ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా కలల కథలా అంటూ సాగే పాటని విడుదల చేశారు. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్‌ని హరిణి పాడారు. చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
‘కలల కథలా ‘… సాగే ‘అమర్ అక్బర్ ఆంటొని’ !
Leave a Comment