తెలుగు న్యూస్ టుడే ➤ ఎన్నికల నియమావళి తెలంగాణాలో రాష్ట్రంలో కొనసాగుతుండటంతో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు పోస్ట్ లో చేరాల్సిన 9 వేల సీఎమ్ ఆర్ ఎఫ్ చెక్కులను రెవెన్యూ శాఖ ఆపేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఎమ్ ఆర్ ఎఫ్ చెక్కులు జారీ చేయడం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. సీఎమ్ ఆఎఫ్ చెక్కులో ముఖ్యమంత్రి ఫొటో ఉంటుందని.. ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని లబ్ధిదారులకు గుర్తు చేస్తుందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది ఎన్నికల కోడు కిందకి వస్తుండటంతో రెవెన్యూ శాఖ పంపిణీ చేయాల్సిన 9వేల చెక్కులకు బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాతే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించారు.
Leave a Comment