హైద్రాబాద్ పోలీసులపై లగడపాటి ఫైర్

 

తెలుగు న్యూస్ టుడే ➤ హైద్రాబాద్ లో నిన్న అర్ధరాత్రి దాటాక పోలీసులు బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌ 65లోని వ్యాపారవేత్త జీపీరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అడ్డుకున్నారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి సోదాలు చేయడానికి ఎలా వచ్చారని లగడపాటి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐజీ నాగిరెడ్డి భూమికి సంబంధించిన విషయంలో తన మిత్రుడిని పోలీసులు బెదిరిస్తున్నారని లగడపాటి రాజగోపాల్‌ ఆరోపించారు.

Leave a Comment