గోవా బ్యూటీ (అఅఅ) లుక్‌ పోస్ట‌ర్

తెలుగు న్యూస్ టుడే ➤ అందం, అభిన‌యంతో కుర్రాళ్లను ఎంత‌గానో క‌ట్టిప‌డేసిన గోవా బ్యూటీ ఇలియానా. పోకిరీ చిత్రంలో ఇలియానా న‌ట‌న‌తో పాటు ఆమె లుక్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఆరేళ్ళ తరువాత తెలుగు ఇండ‌స్ట్రీకి ర‌వితేజ తాజా చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని(అఅఅ) తో రీ ఎంట్రీ ఇస్తున్నది నాజుకు భామ. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రం తెర‌కెక్క‌గా ఈ సినిమా కోసం ఇలియానా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్టు తెలుస్తుంది. నవంబ‌ర్ 16న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ఇలియానా లుక్‌కి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో ఇలియానా లుక్ స‌రికొత్త‌గా ఉంది. ఆమె అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా టీజర్ తో ఆకట్టుకున్నటీం నవంబర్ 3 న ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మూవీ టీమ్ . ర‌వితేజ‌, ఇలియానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అతి త్వ‌ర‌లోనే చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాతో ఇలియానా తెలుగులో మ‌రిన్ని ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.

Leave a Comment