తెలుగు న్యూస్ టుడే ➤ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికి కొద్దిగా ఫ్రీ టైం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఆసక్తి చూపుతుంటాడు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి సరదాగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇక తన సతీమణితో ఎంతో అన్యోన్యంగా ఉండే బన్నీ ఆ మధ్య తన భార్య సోలో ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్ ! నేను నమ్మలేకపోతున్నాను. ఇంత అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా అంటూ కామెంట్ పెట్టాడు. తన భార్య ధరించిన సల్వార్ కమీజ్ డ్రెస్‌ని స్టైలిస్ట్ హర్మన్ కౌర్ అందంగా తయారు చేశారని కూడా తెలిపాడు. ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే బన్నీ గతంలోను తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో అవి కొద్ది క్షణాలలోనే వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే నేడు తన అర్ధాంగి స్నేహా రెడ్డి బర్త్ డే కావడంతో ఇద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. నా క్యూటీకి బర్త్‌డే విషెస్. ఆమె నా రాణి అని కామెంట్ పెట్టాడు. చివరిగా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ తర్వాతి సినిమాని ఓకే చేయలేదు.