తెలుగు న్యూస్ టుడే ➤ మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం సైరా. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. చిత్రంలో ప్రధాన పాత్రలకి సంబంధించిన ఫోటోలని వారి బర్త్‌డే సందర్బంగా విడుదల చేస్తున్న టీం బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేసింది. నేడు అమితాబ్ బచ్చన్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. గతంలోనే సెట్‌లో చిరు, నయనతారతో కలిసి ఉన్న ఫోటోని అమితాబ్ షేర్ చేయగా ఇప్పుడు అఫీషియల్‌గా అమితాబ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. రాజగురువు గోసయి వెంకన్న పాత్రలో అమితాబ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. విజయ్ సేతుపతి, సుదీప్ , జగపతి బాబు, నయనతార తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై రామ్ చరణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండగా యాక్షన్ సీన్స్ కోసం స్కైఫాల్, హ్యారీ పొటర్‌లకి పని చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు ఉన్నారు.
బిగ్ బి సైరా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
Leave a Comment