మళ్ళీ పుట్టిన ఏఎన్ఆర్ … !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలుగు సినిమా సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. నటసామ్రాట్ ఎక్కడో ఓ చిన్న గ్రామంలో పుట్టి అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. తెలుగు సినిమా చరిత్రతో నాగేశ్వరరావు పేరు అజరామరం. 1941లో మద్రాస్ లో అడుగుపెట్టిన నాగేశ్వరరావు చిత్రసీమలో ఎన్నో మజిలీలు చేశారు. మలుపులు చూశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని, ఆటంకాల్ని ఎదుర్కొని, అవరోధాల్ని అధిగమించి హీరో అయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి నటశిఖరం చేరుకున్నారు. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రంలో నుండి ఏఎన్ఆర్ ఫస్ట్ లుక్ విడుద‌ల చేశారు. చిత్రంలో ఏఎన్ఆర్‌గా ఆయ‌న మ‌న‌వ‌డు సుమంత్ న‌టిస్తుండ‌గా, ఏఎన్ఆర్ లుక్‌లో సుమంత్ అచ్చు గుద్దిన‌ట్టున్నాడు. అక్కినేని అభిమానుల‌ని ఈ ఫ‌స్ట్ లుక్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. విష్ణు ఇందూరి , సాయి కొర్రపాటి లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్‌గా బాల‌య్య‌, చంద్ర‌బాబుగా రానా లుక్స్ మాత్ర‌మే విడుద‌ల‌య్యాయి.

Leave a Comment