తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. సెప్టెంబర్ 20న చిత్ర ఆడియోని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇటీవల చిత్రానికి సంబంధించిన తొలి సాంగ్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా రెండో సాంగ్ విడుదల చేశారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ రాయగా , కాళభైరవ ఆలపించారు. రాయలసీమ నేపథ్యంలో సాగిన పెనివిటి సాంగ్ సంగీత ప్రేక్షకులని అలరిస్తుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాగబాబు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. ఎస్ఎస్ థమన్ చిత్రానికి సంగీతం అందించిన తెలిసిందే.
‘అరవింద సమేత’ రారా పెనిమిటి … సాంగ్ !
Leave a Comment