తెలుగు న్యూస్ టుడే ➤ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటించాయి . తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఈ రోజు ప్రైవేట్ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.
ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల బ్యాంకు అకౌంట్లో ఏటా రూ.30 వేలు జమచేయాలని, ప్రైవేట్ టీచర్లకు ఆరోగ్య బీమా కల్పించాలని, వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని ట్రస్మా డిమాండ్ చేస్తోంది. ఈ బంద్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని ట్రస్మా కోరుతోంది.
Leave a Comment