హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా… !

తెలుగు న్యూస్ టుడే ➤ ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా వెళ్లాలంటే ఢిల్లీనుంచి ప్రయాణించాల్సి వచ్చేదని, ఇకనుంచి హైదరాబాద్ నుంచి నేరు గా వెళ్లవచ్చని స్పైస్‌జెట్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. విమాన సౌకర్యాన్ని వచ్చేనెల పదో తేదీనుంచి అందుబాటులోకి తెస్తామని స్పైస్‌జెట్ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధులు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును బుధవారం కలిశారు. మంత్రి కేటీఆర్‌కు బ్యాంకాక్ ప్రథమ టికెట్‌ను అందజేసి.. విమాన సౌకర్యాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా బ్యాంకాక్‌కు టికెట్ ధర రూ.10,001 (అన్నీ కలుపుకుని), తిరుగు ప్రయాణానికి రూ.8,316 నిర్ణయించామన్నారు. హైదరాబాద్ నుంచి గువాహటి విమానం నడుపుతామన్నారు. టికెట్ ధర హైదరాబాద్ నుంచి గువాహటికి రూ.4,286, గువాహటి నుంచి హైదరాబాద్‌కు రూ.4,148గా నిర్ణయించామని చెప్పారు.

Leave a Comment