రవితేజ ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’ టీజర్‌ !

 

తెలుగు న్యూస్ టుడే ➤ మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రోజు దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఓ గిఫ్ట్‌ ఇచ్చారు. పివోట్‌ టీజర్‌ పేరిట ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’కి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రవితేజ ఈ చిత్రంలో చేస్తున్న మూడు క్యారెక్టర్లను పరిచయం చేశారు.

అమర్‌ కాషాయ రంగు దుస్తుల్లో దిగాలుగా ఓ మూలకు కూర్చుని చూస్తుంటే, అక్బర్‌ భవనంలో నుంచి బైనాక్యులర్‌తో చూస్తూ కన్పించారు. ఆంటోనీ స్టైల్‌గా జీన్స్‌ టీషర్ట్‌ వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూపించారు. టైటిల్‌ని బట్టి చూస్తే ఈ చిత్రంలో రవితేజ హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌గా మూడు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్‌ సంగీతంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది .

Leave a Comment