తెలుగు న్యూస్ టుడే ➤ అరవింద సమేత చిత్రం ద్వారా తన అభిమానులకి మంచి ఎంటర్‌టైనర్‌ని అందించాడు ఎన్టీఆర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ఈ క్రమంలో నందమూరి అభిమానులకి ధన్యవాదాలు తెలిపేందుకు చిత్ర యూనిట్ రేపు సాయంత్రం హైద్రాబాద్ శిల్ప కళా వేదికలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్ల సమక్షంలో ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరు కానున్నట్టు తెలుస్తుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో సరసన పూజా హెగ్డే నటించగా, ఈషా రెబ్బా పలువురు నటీ నటులు నటించారు.
నందమూరి అభిమానులకి ధన్యవాదాలు తెలపనున్న ఎన్టీఆర్
Leave a Comment