తెలుగు న్యూస్ టుడే ➤ వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అంతరిక్షం టీజర్ విడుదలైంది. టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్ మూవీగా చెప్పబడుతున్న అంతరిక్షం మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి.
ఊపిరి కూడా కృత్రిమంగా తీసుకునే అంతరిక్షంలో వరుణ్ టీమ్ ఏం చేసిందన్నదే దీని థీమ్ గా కనిపిస్తోంది.
అద్భుతమైన క్వాలిటీతో స్టన్నింగ్ విజువల్స్ తో సంకల్ప్ రెడ్డి మరోసారి తనలోని టాప్ టెక్నీషియన్ ని బయటకు తీసుకొచ్చాడు. క్రిష్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న అంతరిక్షంలో లావణ్య త్రిపాఠితో పాటు అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకుల్లో ఈ టీజర్ తో మంచి ఇంప్రెషన్ రాబట్టుకోవడంలో అంతరిక్షం టీమ్ సక్సెస్ అయ్యింది అనే చెప్పవచ్చు
Leave a Comment