తెలుగు న్యూస్ టుడే ➤ ప్రముఖ నటుడు, నిర్మాత , మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన మాతృమూర్తి లక్ష్మమ్మ (85) ఈ రోజు ఉదయం ఆరు గంటలకి తిరుపతిలోని శ్రీ విద్యానికేతలన్లో కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. మంచు లక్ష్మమ్మ పార్థివదేహాన్ని తిరుపతి నుంచి ఎ.రంగంపేట సమీపంలోగల మోహన్ బాబు విద్యాసంస్థలు విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు. శుక్రవారం తిరుపతిలో లక్ష్మమ్మ అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తుంది.
Leave a Comment