సికింద్రాబాద్ స్టేషన్ లో కలకలం !

 

తెలుగు న్యూస్ టుడే ➤ విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ కు వస్తోన్న జన్మభూమి రైల్లో అలజడి మొదలైయింది . జన్మభూమి రైలు సికింద్రాబాద్ స్టేషన్ కు ఆరో నెంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకు రాగానే డీ1, డీ4 బోగీల్లో మూడు సూట్ కేస్ బ్యాగులను ఎవరో విడిచిపెట్టి వెళ్లిపోయారు. సూట్ కేస్ సంచులనుండి రక్తం కారుతూ దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు ఆ బోగీలను ఖాళీ చేశారు. బ్యాగులో వ్యక్తుల మృతదేహం ఉందేమోనన్న అనుమానంతో ప్రయాణికులు స్టేషన్ లో దిగాక, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరినైనా చంపేసి బ్యాగులో మూట కట్టారా అనే అనుమానాలు స్టేషన్ లో ఒక్కసారిగా అలజడి రేపాయి.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బోగీల్లోకి వెళ్లారు. బ్యాగులను పరిశీలించారు. అందులో.. తాబేళ్లకు సంబంధించిన తోలు, మాంసం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు వందకు పైగా తాబేళ్లను చంపి వాటి తోలు, మాంసాన్ని అక్రమంగా తీసుకెళ్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒక్క తాబేలు తోలు రేటు.. 5 వేల నుంచి 10 వేల వరకు ఉండొచ్చని.. దాదాపు 150 కిలోల వరకు మాంసం బ్యాగుల్లో ఉందని పోలీసులు చెప్పారు.

గుర్తుతెలియని వ్యక్తులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో ఈ సంచులను వదిలివెళ్లినట్లు రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్యాసింజర్స్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఈ తాబేలు తోళ్లు, మాంసాన్ని అటవి శాఖ అధికారులకు అప్పగించారు.

Leave a Comment