తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఇటీవల చిత్రానికి సంబంధించి విడుదలైన అన్నీ సాంగ్స్ మంచి రెస్పాన్స్ సాధించాయి.పెనివిటి అనే సాంగ్ మాత్రం సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంది. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ రాయగా , కాళభైరవ ఆలపించారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా పెనివిటి సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాంచి కిక్ ఇస్తుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా ముఖ్య పాత్ర పోషించింది. నాగబాబు, జగపతి బాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు . ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. ఎస్ఎస్ థమన్ చిత్రానికి సంగీతం అందించిన తెలిసిందే.
‘అరవింద సమేత’ పెనివిటి ప్రోమో సాంగ్!
Leave a Comment