‘అరవింద సమేత’ కు 6 షోస్ పడనున్నాయి

తెలుగున్యూస్ టుడే ➤ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం అక్టోబర్ 11న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానుల కోసం అరవింద సమేత ప్రత్యేక షోలను ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్టోబరు 11 నుంచి 18 వరకు మొత్తం రోజుకు ఆరు స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. ప్రతీ రోజు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలు వేయనున్నారు.

దసరా సెలవులు, భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించడం వల్ల ప్రత్యేక అనుమతి కోరినట్లు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది. ఈషా రెబ్బా, సునీల్‌, జగపతిబాబు, నాగబాబు, నవీన్‌ చంద్ర, రావు రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘రెడ్డి ఇక్కడ సూడు’ పాట ప్రోమోను మంగళవారం (ఈ రోజు) సాయంత్రం 4.50కు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

Leave a Comment