తెలుగున్యూస్ టుడే ➤ తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇటు బాసర నుంచీ అటు తిరుపతి వరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో దేవి శరన్నవరాత్రులు జరపనున్నారు . ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. తిరుపతి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అం కురార్పణ జరగనుంది. ఈ అంకురార్పణ అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అటు విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైవున్న కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు కూడా ప్రారంభంకానున్నాయి . బాసరలో రేపటి నుంచి జ్ఞాన సరస్వతీ దేవి శ్రీశారదీయ శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణపతి పూజ, కలశస్థాపన, ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. తొలిరోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. నాందేడ్ జగదీశ్ మహారాజ్ దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరగనుంది. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ శశిధర్ స్పందిస్తూ.. బాసరలో శరన్నవరాత్రుల సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరి వద్ద గజఈతగాళ్లను సైతం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మరొక ప్రక్క ఈ రోజు నుంచీ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి.
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం
Leave a Comment