నాని … క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు !

తెలుగు న్యూస్ టుడే ➤ నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో చేస్తున్న చిత్రం జెర్సీ . ‘మ‌ళ్ళీ రావా’ ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది . ‘క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు’ అనేది జెర్సీకి ట్యాగ్ లైన్‌ . పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని కొద్ది రోజులుగా రోజుకు 3గంటలు క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాడట. క్రికెట‌ర్‌గానే కాదు పెళ్ల‌యిన న‌డివ‌య‌స్కుడు, ముస‌లి వ్య‌క్తిగా కూడా నాని ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు.

అయితే పీరియాడిక్ చిత్రం తాజాగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. సినిమాకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ఇక చిత్రంలో నాని స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు మ‌ల‌యాళ న‌టి రెబ్బా మోనికా జాన్ మ‌రో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. మలయాళం, తమిళంతో కలిపి నాలుగు సినిమాల్లో నటించిన మోనిక ‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగులో పరిచయం కానున్నారు. రేప‌టి నుండి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది . చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Comment