తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ఓట్ల కోసం నోట్లను బదిలీచేయించడానికి అనేక ముఠాలు ప్రయత్నిస్తున్నాయి . ఇటీవల పలు చోట్ల పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది నోట్లు అక్రమ రవాణా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేశారు. తాజాగా నలుగు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.2.54 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 0.6శాతం కమిషన్‌తో అవసరమైన ఖాతాదారులకు అతుల్ అనే నిందితుడు నగదు బదిలీ చేస్తున్నాడు. రాంకోఠిలో మార్వెల్ మిడోస్‌లో తనిఖీలు నిర్వహించారుపోలీసులు . గత ఎనిమిదేళ్లుగా గుజరాత్‌కు చెందిన అతుల్ రాంకోఠిలో నివాసం ఉంటున్నాడు. అతుల్ అవసరమైన ఖాతాదారులకు హవాలా ద్వారా నగదు బదిలీ చేస్తున్నాడు.
Leave a Comment