తెలుగు న్యూస్ టుడే ➤ దర్శకడు రవిబాబు సుదీర్ఘమైన విరామం తర్వాత తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం హీరోయిన్ పూర్ణ ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన సాంగ్ లో నటించారు. ఆమె నటించిన సాంగ్ ను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ సాంగ్ లో పూర్ణతో పాటు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బంటి(పందిపిల్ల) కూడా స్టెప్స్ వేసిందట. మరి బంటి ఏ రేంజ్ లో డాన్స్ చేసిందో చూడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
అయితే రవిబాబు ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ ‘ఈ సాంగ్ ప్రత్యేకించి ఆడియన్స్ కు ఓ విజువల్ ట్రీట్ ని ఇస్తోంది. ప్రశాంత్ విహారి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. విఎఫ్ఎక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో చిత్రం విడుదల కొంచెం ఆలస్యం అయింది. ఇక దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నాం’ అని తెలిపారు. కాగా లైవ్ యాక్షన్ త్రీడీ సాంకేతికతో రోపొందిన ఈ చిత్రం, పలు భాషల్లో రిలీజ్ కానుంది. రవిబాబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.