తెలుగు న్యూస్ టుడే ➤ అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన మూడో చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మూడో సినిమాని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాడు. తొలి ప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేశారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని అన్నారు. ఊహించినట్టుగానే చిత్ర బృందం కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ ని వీడియోగా విడుదల చేసింది. మిస్టర్ మజ్ను అనే టైటిల్ నే చిత్రానికి ఫిక్స్ చేయగా చిత్రంలో అఖిల్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. థమన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన తొలిప్రేమ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో ఇప్పుడు తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా మంచి విజయం సాదిస్తుందని టీం భావిస్తుంది .
అఖిల్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ !
Leave a Comment