అక్కినేని ఐదవ అంతర్జాతీయ పురస్కారాలు !

 

తెలుగు న్యూస్ టుడే ➤ పద్మవిభూషణ్‌, దాదా షాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సందర్బంగా ‘‘అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా’’ ఐదవ అంతర్జాతీయ పురస్కారాలను అందజేయనుంది. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. డిసెంబర్‌ 22న కరీంనగర్‌లోని ప్రతిమా మల్టీప్లెక్స్‌లో ఐదవ అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుందని ఫౌండేషన్‌ అధ్యక్షులు రావు కల్వల తెలిపారు.

సంస్థ వ్యవస్థాపకుడు డా. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. అతి సాధారణ కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి కృషి, పట్టుదల, దూరదృష్టి వంటి లక్షణాలతో అంచలంచలుగా ఎదిగారని అన్నారు. ఈ లక్షణాలు అందరికి ఆదర్శం కావాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం జరుపుతున్నామని తెలిపారు.

2018వ సంవత్సరపు పురస్కార గ్రహీతలు :

జీవిత సాఫల్య పురస్కారం : సీనియర్‌ నటి, మాజీ లోక్‌ సభ సభ్యురాలు కళాభారతి ‘జమున’, విద్యారత్న : ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, పూర్వ శాసనమండలి సభ్యులు, రాజకీయ విశ్లేషకులు ‘డా. కే నాగేశ్వర్‌’, సినీ రత్న : ప్రముఖ గేయ రచయిత‘ సుద్దాల అశోక్‌ తేజ’, విశిష్ట వ్యాపార రత్న : ‘పవర్‌ మెక్‌’ కంపెనీ ‘సజ్జా కిషోర్‌ బాబు’, రంగస్థల రత్న : ఎస్వీ సంగీత నృత్య కళాశాల హరికథా విభాగం అధ్యాపకులు ‘డా. ముప్పవరపు సింహాచల శాస్త్రి’, వైద్య రత్న : ‘ప్రతిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ ‘బి. శ్రీనివాసరావు’, సేవారత్న : దారిపెల్లి జానకీ రామయ్య, వినూత్న రత్న : కమలా ప్రసాద రావులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

Leave a Comment