తెలుగు న్యూస్ టుడే ➤ కెరీర్‌లో ఆచితూచి అడుగులేస్తున్న అల్లు శిరీష్ మలయాళ రీమేక్ చిత్రం ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులోను ఇదే పేరుతో మూవీ రూపొందుతుంది. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూఎస్ నుండి విహార యాత్రకి ఇండియాకి వచ్చిన ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి తన జీవితంలో ఎదురైన సంఘటలని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాడనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించనున్నారట . ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించిన రుక్సర్ థిల్లాన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. లోగో పోస్టర్‌ని విడుదల చేసిన చిత్ర బృందం ఫిబ్రవరి 8, 2019న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రం తనకి మంచి హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు అల్లు శిరీష్.