రవితేజ ‘ముగింపు రాసుకున్న తర్వాతే … కథ’ టీజర్

తెలుగు న్యూస్ టుడే ➤మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ అంటోని’ టీజర్ ఈరోజే రిలీజ్ అయింది. ‘ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలుపెట్టాలి…మనకు నిజమైన ఆపద వచ్చినపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు..మన బలం’ అంటూ వచ్చే సంభాషణలు ఆసక్తికరంగా ఆలోచింపచేస్తున్నాయి . కిక్ తర్వాత ఇలియానా మరోసారి రవితేజకు జోడీగా నటిస్తోంది.

‘వెంకీ, దుబాయ్‌ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వస్తున్న రవితేజ, శ్రీనువైట్ల కాంబో మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ర‌వితేజ మూడు పాత్రలని ప‌రిచ‌యం చేస్తూ విడుదల చేసిన వీడియో అభిమానుల‌ని అలరిస్తోంది. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Comment