తెలుగు న్యూస్ టుడే ➤ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయలసీమలో అడుగుపెట్టారు. నేడు ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. శంషాబాద్ విమానశ్రయం నుంచి ఆయన ఛార్టెడ్ విమానంలో కర్నూల్‌కు చేరుకున్నారు. కర్నూల్‌కు వచ్చిన రాహుల్, తొలుత పెద్దపాడులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని సందర్శించారు. సంజీవయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
రాహుల్ వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఉన్నారు. మధ్యాహ్నం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో రాహుల్, విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. అనంతరం 2:45కు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, ఆయన నివాసాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.