తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో 21 దేశాల కళాకారులు

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ బతుకమ్మ వేడుకలు సంబురంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రత్యేకంగా అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు మామిడి హరికృష్ణ తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు ఈ నెల 17న జరుగనున్న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయన్నారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో భాగం గా ఈ నెల 16న 21 దేశాల నుంచి పలువురు విదేశీ కళాకారులు తెలంగాణకు విచ్చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మనోహరమైన బతుకమ్మ వేడుకల ప్రదర్శనను వీక్షించేందుకు, ప్రధానంగా అందులో పాల్గొనేం దు కు వీరంతా మంగళవారం వస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 16న రవీంద్ర భారతిలో ప్రత్యేకంగా యువత, అనాథలు, దివ్యాం గుల కోసం జాయ్ ఆఫ్ లైఫ్ (జీవితం యొక్క ఆనందం) పేర బ్రహ్మ కుమారీలు పాల్గొనగా ఎనిమిదో రోజు ఉదయం 9:30 గంటలకు బతు కమ్మ వేడుకలు నిర్వ హించనున్నట్టు తెలిపారు.

మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉమానియా ఇన్‌స్పైర్జ్ ఆధ్వర్యం లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారన్నారు. అయితే, పైడి జయరాజ్ థియేటర్‌లో బతుకమ్మ పండుగకు సంబంధించిన ప్రత్యేక పాటలను ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ నెల 17న ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ మహా ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందని తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రత్యేకంగా లేజర్ షో, ఫైర్ వర్క్స్, వెయ్యి మంది జానపద కళాకారులచే సాంస్కృతిక వేడుకలు, ఇంకా బతుకమ్మల ప్రత్యేక ఊరేగింపు ఉంటుందన్నారు. అయితే, ఈ నెల 18న సాయంత్రం ఆరు గంటలకు బ్రహ్మ కుమారీస్ -శాంతి సరోవర్-గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో విజయ దశమి వేడు కలు జరుగుతాయన్నారు. సాగర తీరం పూలవనమైంది. తీరొక్క పూలు కొత్త ముచ్చ టను గొలిపాయి. బతుకమ్మ పాటలు మన సంప్రదాయా న్ని చాటి చెప్పాయి. సాగర్ మధ్యలో పూలతో అందంగా అలంకరించిన పడవ విశేషంగా ఆకట్టుకున్నది.

Leave a Comment