తెలంగాణా జాయింట్ సీఈఓగా ఐఏఎస్ అధికారిణి కె ఆమ్రపాలి !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారిణి కె ఆమ్రపాలిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో మరో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమ్రపాలి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు వరంగల్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తక్కువ సమయం ఉండడంతో ఉన్నతాధికారుల నియామకం అవసరమైంది. ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పర్యవేక్షణలో ఇప్పటికే ఉన్న అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు మరో ఇద్దరు అధికారులను సహాయకులుగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ఎన్నికల అదనపు అధికారిగా నియమించింది. లేటెస్ట్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని జాయింట్ సీఈఓగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది సీఈసీ.

Leave a Comment