తెలుగు న్యూస్ టుడే ➤ తెరాస పార్టీ ప్రచారాల జోరు కొనసాగుతుంది … తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు (గురువారం) ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా నల్గొండ బైపాస్ రోడ్డులోని మర్రిగూడెం చౌరస్తా సమీపంలో జరిగే ‘ప్రజా ఆశీర్వాద’ సభలో సిఎం పాల్గొననున్నారు.
జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు మూడున్నర లక్షల మంది సభకు వస్తారనే అంచనాతో నేతలు ఏర్పాట్లు చేశారు. సుమారు 40 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 5 చోట్ల 160 ఎకరాలను కేటాయించారు. సభా ప్రాంగణం పక్కనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో వాహనాల్లో కార్యకర్తలు, ప్రజలను తరలించనున్నారు. సభాప్రాంగణంతో పాటు నగరం నలువైపులా పెద్దఎత్తున జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కేసీఆర్ నల్గొండ ‘ప్రజా ఆశీర్వాద’ సభ
Leave a Comment