తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం అరవింద సమేత..వీర రాఘవ. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుండగా, ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడు.అయితే ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బాని ఎంపిక చేశారు . అరవింద సమేత చిత్రం దసరా కానుకగా విడుదల అవుతుందని తెలిసిన కరెక్ట్ డేట్ ఎప్పుడు అనే క్లారిటీ లేకపోయింది. తాజాగా చిత్ర యూనిట్ పోస్టర్స్ ద్వారా అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అక్టోబర్ 11న ‘అరవింద సమేత’ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు !
Leave a Comment