తెలుగు న్యూస్ టుడే ➤ విశాల్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పందెం కోడి చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా పందెం కోడి 2 తెరకెక్కుతుంది. తమిళంలో ఈ చిత్రం సందకోళి 2 పేరుతో విడుదల కానుంది. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ లేడి విలన్‌గా కనిపించనుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై విశాల్, ధావల్ జయంతిలాల్, అక్షయ్ జయంతిలాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో విశాల్ రఫ్ఫాడించాడు. కీర్తి సురేష్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. లేడి విలన్ గెటప్‌లో వరలక్ష్మీ లుక్ అదిరిపోయింది. జాతర లో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందే వేషాలు వేయకూడదు అనే డైలాగ్ అదిరిపోయింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు.
దసరా కానుకగా విశాల్ పందెం కోడి 2 !
Leave a Comment