మీ అందరి మహాలక్ష్మి..త్వరలో మీ ముందుకి 🙂#ThatIsMahalakshmi #TheSweetestGirl @tamannaahspeaks @prasanthvarma @ItsAmitTrivedi @mediente #QueenRemakes pic.twitter.com/Ei5SBJ4HhV
— That Is Mahalakshmi (@TiMTheFilm) September 25, 2018
తెలుగు న్యూస్ టుడే ➤ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్..నాలుగేళ్ళ క్రితం కంగనా రౌనత్ టైటిల్ రోల్ పోషించిన క్వీన్ ఎంతటి సంచలన విజయం సాధించిందో నటిగా తనకు అంత కన్నా ఎక్కువ గుర్తింపు ఇచ్చింది. అప్పటి నుంచి దీన్ని వివిధ భాషల్లో రీమేక్ చేయాలనీ ప్రయత్నించినప్పటికీ ఫైనల్ ఇప్పటికి కుదిరింది. ఒకేసారి నాలుగు భాషల్లో నలుగురు వేర్వేరు హీరోయిన్లు దర్శకులతో రూపొందిన క్వీన్ రీమేక్ వెర్షన్లు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్లు మొదలుపెట్టేసిన నిర్మాతలు ఒకేసారి నలుగురి ఫస్ట్ లుక్స్ విడుదల చేసారు.
హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్, తెలుగులో దటీజ్ మహాలక్ష్మీ అనే టైటిల్స్ తో రూపొందుంది. తెలుగు వర్షెన్‌ని అ చిత్ర ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా, కన్నడ వర్షెన్‌ని రమేష్ అరవింద్, మలయాళ వర్షెన్‌ని నీలకంఠ, తమిళ వర్షెన్‌ని కూడా రమేష్ అరవింద తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని భాషలకి సంబంధించి షూటింగ్ ప్రక్రియ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు. అతి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ఈ రోజు సోషల్ మీడియా ద్వారా క్వీన్ భామల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. వారి ఫోటోలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. నార్త్‌లో మంచి హిట్ కొట్టిన ఈ చిత్రం సౌత్‌లోని అన్ని భాషలలోను సూపర్ డూపర్ విజయం సాధించడం ఖాయం అంటున్నారు.