తిత్లీ తుఫాను భాదితులకు రాజశేఖర్ దంపతుల ఆర్ధిక సాయం

తెలుగు న్యూస్ టుడే ➤ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజ‌య న‌గ‌రం జిల్లాల‌లో ఇటీవ‌ల తిత్లీ తుఫాను సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతా కాదు. ఈ తుఫాను వ‌ల‌న ఉద్దానం , సిక్కోలులోని ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌తో అల్లాడిపోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు అందరు వారిని ఆదుకునేందుకు ప‌లు రంగాల‌కి సంబంధించిన ప్రముఖులు ముందుకు వ‌చ్చారు. ముఖ్యంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, క‌ళ్యాణ్ రామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సంపూర్ణేష్ బాబు, కొర‌టాల శివ‌, అనీల్ రావిపూడి త‌దిత‌రులు ఆర్ధిక సాయం అందించారు. తాజాగా రాజ‌శేఖ‌ర్ దంప‌తులు అమ‌రావ‌తిలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబుగారిని కలిసి నిరాశ్ర‌యుల‌యిన వారి కోసం ప‌ది ల‌క్ష‌ల చెక్ ని అందజేశారు. క‌ష్ట‌కాలంలో త‌మ‌కి అండ‌గా నిల‌బ‌డ్డందుకు సిక్కోలు ప్ర‌జ‌లు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. గ‌రుడ‌వేగ చిత్రంతో మంచి హిట్ కొట్టిన రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్కనుంది. ఇటీవ‌ల విడుద‌లైన చిత్ర ప్రీ లుక్ అభిమానుల‌లో ఆస‌క్తిని క‌లిగించింది.

Leave a Comment