నెటిజన్స్ కోసం రిప్లే ఇచ్చిన ఆర్ ఎక్స్ 100 కార్తికేయ !

తెలుగు న్యూస్ టుడే ➤ తాము ఆర్టిస్టులం మాత్రమే అని.. టెర్రరిస్టులం మాత్రం కాదని అన్నాడు హీరో కార్తికేయ. సినిమాల ప్రభావంతో మైనర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విమర్శలపై ఆర్ ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ స్పందించాడు. ఆర్ ఎక్స్ 100 సినిమాలో సన్నివేశాల ప్రభావంతోనే జగిత్యాలలో ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పడం, ఆ తర్వాత ఇది వివాదాస్పదం కావడంతో కార్తికేయ ట్విట్టర్ లో తన స్పందన తెలిపాడు. జనాన్ని ఎంటర్ టెయిన్ చేయాలనే ఉద్దేశంతోనే తాము సినిమాలను తీస్తామని అన్నాడు.
“ఆర్ ఎక్స్ 100 అనే సినిమాలో గానీ… పిల్లా రా అనే పాటలో గానీ హీరో సూసైడ్ చేసుకున్నట్టు ఎక్కడా లేదు… హీరోయిన్ పాత్ర అయిన ఇందు.. హీరోను చంపించేందుకు ప్రయత్నం మాత్రమే చేస్తుంది. సినిమాలో హీరో ఎక్కడా సూసైడ్ చేసుకోడు. మరి పిల్లలు సూసైడ్ చేసుకున్న విషయంలో తమను బాధ్యులను చేయడం ఎంతవరకు కరెక్ట్?” అని వీడియోతో ప్రశ్నించాడు కార్తికేయ.

తానేదో దులుపుకోడానికి చెప్పడం లేదని.. చనిపోండి.. నెగెటివిటీ తీసుకోండి అని సినిమాల్లో ఎవరూ చెప్పరని అన్నాడు కార్తికేయ. “ఇద్దరు పిల్లలు నెగెటివ్ గా మారుతున్నారనిపిస్తే… అది గమనించినవాళ్లు … వాళ్ల మైండ్ సెట్ మార్చాలి. సొసైటీ అలాంటి వాళ్లను కరెక్ట్ వే లో పెట్టాలి. బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు… ఆర్టిస్టులు, డైరెక్టర్లను టెరర్రిస్టుల్లాగా చూడటం ఎంతవరకు కరెక్ట్. మమ్మల్ని తిట్టడం మానేయండి. చుట్టుపక్కల ఉన్నవాళ్లను మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నా” అని చెప్పాడు కార్తికేయ.

కార్తికేయ వివరణను చాలామంది సమర్థిస్తున్నారు. ఐతే… ఎమోషన్స్ పెంచేసే ఇలాంటి సినిమాలు తీసి సారీ చెప్పకపోగా… ఎదురు ప్రశ్నించడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. చూద్దాం ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో … ?

 

Leave a Comment