తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణాలో రాజకీయ రగడ, ముందస్తు ఎన్నికల ప్రచారాలకు స్వపక్షాలు , ప్రతిపక్షాలు హోరా హోరీగా సాగుతున్నాయి . తెలంగాణ కాంగ్రెస్ వ్యూహ కమిటీ ఛైర్మన్ వి.హనుమంతరావు నిర్వహించ తలపెట్టిన ఇందిర రథయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతిలేనందువల్లే రథయాత్రను అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం నుంచి ఇందిరమ్మ యాత్ర పేరుతో రథయాత్ర నిర్వహించాలని వి. హనుమంతారావు తలపెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ రథయాత్రతో గన్‌పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి వచ్చారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గజ్వేల్‌కు బయలుదేరుతుండగా పోలీసులు అనుమతి లేదంటూ నిరాకరించి రథయాత్రను గన్‌పార్కు వద్దే నిలిపివేశారు.
Leave a Comment