అరవింద కోసం ఉద్యోగులకు హాలిడే ఫ్రీ టికెట్స్ : సాఫ్ట్‌వేర్ కంపెనీ

తెలుగు న్యూస్ టుడే ➤ ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రెండ్ ‘అరవింద సమేత’ ఫీవర్ . సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు నుంచే ఈ సినిమా గురించి చర్చలు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ప్రేక్షకులు. చివరికి ఆ తరుణం రానే వచ్చింది. అరవింద సమేత సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే కొందరికి ముందు రోజు నుంచే నిద్ర ఉండదు. దీంతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ తమ ఉద్యోగుల కోసం నేడు(గురువారం) అరవింద సమేత సినిమాను చూడండి అంటూ హాలిడేని ప్రకటించింది.

అంతేనా.. సినిమా టికెట్స్‌ను కూడా ఫ్రీగా అందజేసింది. మనసంతా సినిమాపై ఉంటే అవుట్ పుట్ సరిగా రాదు. అందునా తమ వద్ద పనిచేసే ఉద్యోగుల కోరికను తీర్చినట్టూ ఉంటుందని ఆలోచించిందో ఏమో కానీ.. ‘విమోస్ టెక్నో క్రాట్స్’ అనే కంపెనీ యాజమాన్యం ఇలా శలవు ప్రకటించి.. టికెట్స్‌ని ఫ్రీగా అందజేసి మరీ తమ ఉద్యోగులను సినిమాకు పంపించి వార్తల్లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా తొలి ఆటతోనే మంచి స్పందనను రాబడుతోంది.

Leave a Comment